ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

  

(1) నిత్య జీవితంలో కూడా గ్రాంథిక భాషనే ఉపయోగించిన పండితుడు.

      (ఎ) విశ్వనాధ సత్యనారాయణ (బి) కొక్కొండ వెంకటరత్నం (సి) గిడుగురామ్మూర్తి (డి) కందుకూరి వీరేశలింగం

 

(2) 'కాంతం' అనే స్త్రీ పాత్రను ప్రసిద్దం చేసిన రచయిత

      (ఎ) మునిమాణిక్యం నరసింహారావు (బి) చింత దీక్షితులు (సి) పురాణం సుబ్రహ్మణ్య శర్శ (డి) రంగనాయకమ్మ

 

(3) అష్టాదశ పురాణాలలో లేనిది

    (ఎ) బ్రహ్మ పురాణం (బి) గరుడ పురాణం (సి) వరాహ పురాణం (డి) సర్పపురాణం

 

(4) 'మోహనవంశి' రచయిత్రి

      (ఎ) కోడూరి కౌసల్యాదేవి (బి) లత (సి) మాలతీచందూర్ (డి) కె.రామలక్ష్మి

 

(5) 'అడవి శాంతిశ్రీ' రచయిత

     (ఎ) అడవి బాపిరాజు (బి) పాలగుమ్మి పద్మరాజు (సి) కరుణశ్రీ (డి) దేవులపల్లి కృష్ణ శాస్త్రి

 

(6) తన రచనలన్నింటినీ కల్యాణ చక్రవర్తికి అంకితం చేసిన రచయిత్రి

     (ఎ) కల్యాణ సుందరీ జగన్నాథ్ (బి) మాదిరెడ్డి సులోచన (సి) కోడూరి కౌసల్యాదేవి (డి) జలంధర

 

(7) స్టూవర్ట్ పురం దొంగల సంస్కరణ కోసం, పోలీసు అధికారుల సలహా మేరకు ఉద్యమించిన సంఘసేవకురాలు

    (ఎ) మల్లాది సుబ్బమ్మ (బి) హేమలతా లవణం (సి) కొండపల్లి కోటేశ్వరమ్మ (డి) సరస్వతి గోరా

 

(8) లక్ష్మణుడు సీతను వదిలేసిపోయాక దృశ్యాన్ని వర్ణించే పద్యం-  రమణి మరికొంత వడిగాక రథము జూచు/ తరుణి మరి కొంతసేపు కేతనము జూచు/ కాంత మరి మీద రథపరాగంబు జూచు / పడతి మరియంతటను వట్టి బయలు సూచు

     (ఎ) మొల్ల (బి) వాల్మీకి (సి) కంకటి పాపరాజు (డి) జంధ్యాల పాపయ్యశాస్త్రి

 

(9) భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగె / కలియుగంబున నికనుంట కష్టమనుచు..

   (ఎ) జాషువా (బి) నన్నయ (సి) పోతన (డి) శ్రీనాధుడు

 

(10) తారకామణులలో తారనైమెరసి / మాయమయ్యెదను నా మధురగానమున  

(ఎ) జాషువా (బి) కరుణశ్రీ (సి) దేవులపల్లి (డి) తిలక్

 

(11) 'మాట యందలి చమత్కారము'

(ఎ) చాటువు (బి) హాస్యగుళిక (సి) నుడికారము (సి) పద హాస్యము

 

(12) 'నెలజోడు' అంటే ఎవరు?

(ఎ) చంద్రుడు (బి) సూర్యుడు (సి విష్ణువు (డి) నారదుడు

 

(13) 1936లోని 'మాయాబజార్'లో శశిరేఖ పాత్రధారిణి సుబ్బమ్మ

(ఎ) కమలాబాయి (బి) కన్నాంబ (సి) శాంతకుమారి (డి) కాంచనమాల

 

(14) ఎస్. జానకి తొలిపాట

(ఎ) నీ ఆశా అడియాసా - చెయిజారే మణి పూసా  (బి) నీలిమేఘాలలో గాలి కెరటాలలో

(సి) నీలీల పాడెదదేవా  (డి) పగలే వెన్నెల

 

(15) శ్రీ శ్రీ మహాప్రస్థాన కవితల్లో పేర్కొనబడిన నటి

(ఎ) ఎలిజిబెత్ టేలర్ (బి) సురభి కమలాబాయి (సి) కాంచనమాల (డి) కన్నాంబ

 

(16) కారుమబ్బులు వరించిన / కటిక చీకటి జీవితంలో / వెలుగులను ప్రసరింపచేసిన / కాంతిమూర్తీ స్వాగతం

(ఎ) సినారె (బి) అదృష్టదీపక్ (సి) రసరాజు (డి) జాలాది

 

(17) చినుకురాలితే చిగురునవ్వదా - చిలుక వాలితే చెట్టుపాడదా

(ఎ) రసరాజు (బి) రాజశ్రీ (సి) భువనచంద్ర (డి) సిరివెన్నెల

 

(18) తనువా.. ఉహూ.. హరిచందనమే / పలుకా - ఊహూ అది మకరందమే

(ఎ) అనిసెట్టి సుబ్బారావు (బి) జి.విశ్వనాధం (సి) దేవులపల్లి కృష్ణశాస్త్రి (డి) గోన విజయరత్నం

 

(19) అందమె ఆనందం / ఆనందమె జీవిత మకరందం

(ఎ) సముద్రాల (బి) సముద్రాల జూనియర్ (సి) మల్లాది రామకృష్ణశాస్త్రి (డి) సినారె

 

(20) అతని పావన పాదధూళికై అవని అణువణువు కలవరించేను

(ఎ) సంపూర్ణరామాయణం (బి) భక్తకన్నప్ప (సి) అల్లూరి సీతారామరాజు (డి) పాండురంగ మహాత్యం


 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!