ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

(1) భారతంలో అష్టాదశ పర్వాలలో ఒకటి కానిది

      (ఎ) ద్రోణ పర్వము (బి) కర్ణపర్వము (సి) భీష్మ పర్వము (డి) అర్జున పర్వము

 

(2) 'బంగారి మామ' పాటలు వ్రాసిన కవి

     (ఎ) నండూరి సుబ్బారావు (బి) కొనకళ్ళ వెంకటరత్నం (సి) శేషేంద్ర శర్మ (డి) వింజమూరి అనసూయ

 

(3) 'వడ్లగింజలు' నే ప్రసిద్దమైన కథను వ్రాసినవారు

      (ఎ) గురజాడ అప్పారావు (బి) మధురాంతకం రాజారాం (సి) శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి (డి) చలం

 

(4) తెలుగులో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంధం

     (ఎ) 1746 - బైబిల్ (బి) 1800 - భగవద్గీత (సి) 1820 - పంచతంత్రం (డి) 1790- మహాభారతం

 

(5) కృష్ణాపత్రికలో 'చలవ మిరియాలు' శీర్షికలో  వ్యంగ్య  హాస్య రచనలు చేసినవారు

     (ఎ) మల్లాది రామకృష్ణ శాస్త్రి (బి) పింగళి నాగేంద్రరావు (సి) రావూరి సత్యనారాయణ (డి) విశ్వనాధ సత్యనారాయణ

 

(6) 1904లో 'సావిత్రి' అనే పేరుతో మహిళల కోసం పత్రిక ప్రారంభించినవారు

      (ఎ) కందుకూరి రాజ్యలక్ష్మి (బి) వింజమూరి సత్యవరి (సి) పులుగుర్త లక్ష్మీ నరసమాంబ (డి) కనుపర్తి వరలక్ష్మమ్మ 

 

(7) 'ఫన్ డాక్టర్'గా పేరుపొందిన అనుకరణ విద్యలో లబ్ధప్రతిష్టులు

     (ఎ) వేణుమాధవ్ (బి) డా.చంద్రశేఖరం (సి) డా. తంబు (డి) ధారా రామనాధశాస్త్రి

 

(8) 'దద్దనాల' కుటుంబమ్నుంచీ వచ్చిన రచయిత్రి

     (ఎ) కౌసల్యాదేవి (బి) రమామణి (సి) రంగనాయకమ్మ (డి) లత

 

(9) 1983లో గాస్‌స్టవ్ ప్రమదంలో భర్తతో కలిసి మరణించిన రచయిత్రి

     (ఎ) మాదిరెడ్డి సులోచన (బి) వాసిరెడ్డి సీతాదేవి (సి) పవని నిర్మల ప్రభావతి (డి) ఇల్లిందల సరస్వతీదేవి

 

(10) 18 ఏళ్ళ  వయస్సులో చిత్రకారుడైన భర్తను కోల్పోయి ఆ తర్వాత జీవితాంతం చిత్రకళకే అంకితమైపోయిన చిత్రకారిణి

        (ఎ) దామెర్ల సత్యవతి (బి) దామెర్ల సత్యవాణి (సి) దామెర్ల సత్యప్ర (డి) దామెర్ల సత్యశ్రీ

 

(11) నీరాటము

      (ఎ) నాచు (బి) జలచరము (సి) తామరపువ్వు (డి) నీటిగుర్రం

 

(12) కల్లు త్రాగు పాత్ర

       (ఎ) కల్వారము (బి) దోనె (సి) అంబలి (డి) చషకము

 

(13) మంజూష

       (ఎ) పెట్టె (బి) పొదరిల్లు (సి) ద్రాక్ష సారాయి (డి) పక్షిగూడు

 

(14) చిలుకలు కూయనో చెలువులు చిల్లులు వోవగ..

        (ఎ) మనుచరిత్ర (బి) శృంగారనైషధం (సి) కాశీఖండం (సి) పారిజాతాపహరణం

 

(15)మలసానిల విలోల దళసాస వరసాల / ఫలసాదర శుకాల పన విశాల

     (ఎ) వసుచరిత్ర (బి) శృంగార నైషధం (సి) ఋతుఘోష (డి) ఆముక్తమాల్యద

 

(16) మొండి చేతులవాడవెందుకైనావంటే చేతికెముకలేని దాతవని చాటుటకే

       (ఎ) రంగులరాట్నం (బి) శ్రీ వేంకటేశ్వర మహత్యం (సి) బావామరదళ్ళు (డి) చిరంజీవులు

 

(17) వలపను మాటలో ముందేవుంది వల కలవారి కావ్యములో తొలి పలుకే కల

       (ఎ) ముత్యాలముగ్గు (బి) గోరంతదీపం (సి) బంగారు పిచ్చుక (డి) సాక్షి

 

(18) నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు - వినాయకుల చప్పట్లు శుద్దగ్యాసు

       (ఎ) లక్ష్మి నివాసం (ని) మంచి కుటుంబం (సి) కులగోత్రాలు (డి) ఇల్లరికం

 

(19) నిట్టూర్చె గాలి - నిదురించె భూమి / నిను చూసి నవ్వింది ఆకాశం

       (ఎ) కురుక్షేత్రం (బి) సాక్షి (సి) జాకీ (డి) సుందరకాండ

 

(20) ప్రియమగు చెలిమి - సాటిలేని కలిమి

       (ఎ) పునర్జన్మ (బి) పూజాఫలం (సి) దేశద్రోహులు (డి) కన్నెమనసులు


 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!