ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

(1) స్వతంత్ర భారతదేశంలో తెలుగు భాషలో మొట్టమొదట ఆస్థాన కవి

(ఎ) విశ్వనాధ సత్యనారాయణ (బి) చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి (సి) దేవులపల్లి కృష్ణశాస్త్రి (డి) ధర్మవరం కృష్ణమాచార్యులు

 

(2) 'పేరిగాడు' అనే ప్రసిద్ధ హాస్యపాత్ర ఏ నాటకంలోనిది?

(ఎ) బారిష్టర్ పార్వతీశం (బి) గణపతి (సి) ప్రతాపరుద్రీయం (డి) చింతామణి

 

(3) 'అతడు అడవిని జయించాడు' రచయిత

(ఎ) డా. కేశవరెడ్డి (బి) ఎన్.ఆర్ నంది (సి) అంపశయ్య నవీన్ (డి) యండమూరి వీరేంద్రనాథ్

 

(4) "జో అచ్యుతానంద..జోజో..ముకుందా.." అనే గీతం

(ఎ) క్షేత్రయ్యపదం (బి) అన్నమయ్య పదాలు (సి)దేవులపల్లి వ్రాసిన గీతం (డి) కరుణశ్రీ గేయం.

 

(5) "గోలకొండ కవుల సంచిక” వ్రాసినవారు

(2) సురవరం ప్రతాపరెడ్డి (బి) కట్టమంచి లింగారెడ్డి (సి) దాశరధి రంగాచార్యులు (డి) కాళోజీ నారాయణరావు

 

(6) గయోపాఖ్యానం - ప్రసిద్ద రంగస్థల నాటకరచయిత

(ఎ) తిరుపతి వెంకటకవులు (బి) కందుకూరి వీరేశలింగం (సి) చిలకమర్తి లక్ష్మి నరసింహం (డి) పానుగంటి లక్ష్మీ నరసింహారావు

 

(7) 'అమవసనిసి' ప్రయోగం చేసిన కవి

(ఎ) తెనాలి రామలింగడు (బి) పెద్దన (సి) పోతన (డి) శ్రీకృష్ణ దేవరాయలు

 

(8) 'ముగ్గురమ్మల మూలపుటమ్మ' ప్రయోగం చేసిన కవి

(ఎ) పోతన (బి) మొల్ల (సి) తాళ్ళపాక తిమ్మక్క (డి) అన్నమయ్య

 

(9) ఇంగ్లీషులో వచ్చిన 'స్పెక్టేటర్' వ్యాసాల ప్రేరణతో తెలుగులో వచ్చిన వ్యాసాల సంపుటి

(ఎ) వ్యాసమంజరి (బి) సాక్షి (సి) నిప్పులాంటి నిజం (డి) ద్రష్ట

 

(10) 'వెండిలాంతరు వెలిగించి వెడలె రజని' అని వ్రాసిందెవరు?

(ఎ) దాశరధి (బి) నండూరి సుబ్బారావు (సి) రాయప్రోలు సుబ్బారావు (డి) దేవులపల్లి కృష్ణ శాస్త్రి

 

(11) దోగ్ధ - అంటే అర్ధం

(ఎ) ఆవు (బి) దూడ (సి) గొర్రె (డి) కోడిపుంజు

 

(12) గోకర్ణము

(ఎ) కంచర గాడిద (బి) రోకలి (సి) పక్షి యీక (డి) వానపాము

 

(13) నక్తంరుడు

(ఎ) రావణుడు (బి) రాక్షసుడు (సి) నారదుడు (డి) రోగి

 

(14) 'అనుభవాలు జ్ఞాపకాలు' పేరుతో ఆత్మకథ రాసుకున్న కవి

(ఎ) కందుకూరి వీరేశలింగం (బి) గురజాడ (సి) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (డి) చలం

 

(15) కొల్లాయి గట్టితేనేమీ - మాగాంధీ కోమటై పుట్టితేనేమీ

(ఎ) బసవరాజు అప్పారావు (బి) కరుణశ్రీ (సి) దేవులపల్లి (డి) దాశరధి.

 

(16) 'మగువలు తొంగిచూసేరంట.. మనలను గెలిచేసేరంట'

(ఎ) గోరింటాకు (బి) రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (సి) గోరంతదీపం (డి) ముత్యాలముగ్గు

 

(17) పిడికిలి మించని హృదయంలో - కడలిని మించిన ఆశలు దాచెను

(ఎ) మిస్సమ్మ (బి) గుండమ్మ కథ (సి) భాగ్యచక్రం (డి) పెళ్ళిచేసి చూడు

 

(18) ఏ బాధా లేనోడు – భూమ్మీదలేనోడే - మనిషై పుడితే దేవుడికైనా కంటనీరు ఖాయమేనురా

(ఎ) సిరివెన్నెల (బి) చంద్రబోస్ (సి) రామజోగయ్య (డి) అనంత శ్రీరాం

 

(19) అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం నీదిరా - లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవెరా

(ఎ) ఠాగోర్ (బి) అపరిచితుడు (సి) జై సింహ (డి) కథానాయకుడు

 

(20) ఎగిరింది కడలి కెరటం - ఆ నింగి స్నేహంకోసం

(ఎ) సినారె (బి) ఆరుద్ర (సి) గోన విజయరత్నం (డి) గోపి


 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!