ప్రతినెలా ఈ శీర్షిక సాహితీ -  సినీ అభిమానులకు సత్కాలక్షేపం..!
  సమాధానాలకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
సమాధానాల లింక్ కూడా చివరలో ఉంది.
****

  

(1) మాఘే మేఘ వయ గతం -  అనే నానుడి ఏ పౌరాణిక ఘట్టానికి సంబందించినది?

     (ఎ) శిశుపాల వధ (బి) కంస వధ (సి) కీచక వధ (డి) రావణ వధ

 

(2) అశ్వభారతం - హార్స్ రేసెస్ గురించి నవల వ్రాసిన రచయత

      (ఎ) యండమూరి (బి) మల్లాది వెంకటకృష్ణమూర్తి (సి) చందు సోంబాబు (డి) సూర్యదేవర రామ్మోహనరావు.

 

(3) చిట్టీ చిట్టీ బ్యాంగ్ బ్యాంగ్ - వ్యంగ్య హాస్య నవల వ్రాసిందెవరు?

      (ఎ) యర్రంశెట్టి శాయి (బి) మల్లిక్ (సి) బాపు (డి) బాలి

 

(4) గాజుపాలెం గాంధీ - కథా రచయిత

      (ఎ) గురజాడ అప్పారావు (బి) మునిపల్లె రాజు (సి) మొక్కపాటి నరసింహశాస్త్రి (డి) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

 

(5) నవ్యాంధ్ర పంచకావ్యాల్లో ఒకటి

     (ఎ) పాండురంగ మహాత్య్మం (బి) సౌందరనందం (సి) వేయిపడగలు (డి) సాక్షి

 

(6) గిన్నె నందించువారు లేకున్నయపుడు -  కుండనే నోటి కానించుకొనుట మేలు

     (ఎ) గాలీబు గీతాలు (బి) ఉమర్‌ఖయ్యాం రుబాయిలు (సి) గురజాడ ముత్యాల సరాలు (డి) రామదాసు కీర్తన

 

(7) ఆడితప్పిన వాని - నాలి నేలని వాని - నాదరించుట హాని

      (ఎ) దాశరధి (బి) సినారె (సి) ఆరుద్ర (డి) ముళ్ళపూడి

 

(8) కొరివి శిష్టాన్నములు గొను ఆకలి ఒకటే - తిరుగు దుష్టాన్నములు తినునాకలొకటే

     (ఎ) త్యాగరాజస్వామి (బి) అన్నమయ్య (సి) శ్యామశాస్త్రి (డి) పోతన

 

(9) సత్యవ్రతీ శతకం

     (ఎ) గురజా (బి) వీరేశలింగం (సి) చిన్నయసూరి (డి) దేవులపల్లి

 

(10) పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో ఎలా వుండాలో చెప్పే నీతి సూక్తుల శతకం

       (ఎ) శ్రీమతి శతకం (బి) మహిళామణి శతకం (సి) నారీ శతకం (డి) కుమారి శతకం. 

 

(11) ధూమ్రపత్రము

      (ఎ) రాగిరేకు (బి) తమలపాకు (సి) పొగాకు (డి) అరిటాకు

 

(12) కుళింగము

       (ఎ) కాకి (బి) అడవి పిచ్చుక (సి) గద్ద (డి) రామచిలుక

 

(13) జయించాలి అనే కాంక్ష ఎక్కువగా వుండడానికి ఈ పదం వాడతారు.

        (ఎ) జనమేజయ (బి) విజిగీష (సి) విచికిత్స (డి) విభ్రమాంశ

 

(14) మనికి

(ఎ) ఉత్తమ వ్యక్తిత్వంగవనిత (బి) జీవితంలో చివరిదశ (సి) జీవించడం (డి) జీవమున్న ప్రాణి

 

(15) హిమాంబువు

(ఎ) పన్నీరు (బి) కర్పూరము (సి) పొగమంచు (డి) మంచుతుఫాను

 

(16) కనులనిండ నీ రూపమే కాపురముంటే - మనసంతా నీ స్మృతులే రగులుతుంటే   

       ఎన్నాళ్ళీ కారుచిచ్చులోన దాచగలను ఎన్నాళ్ళీ      ఒంటరి బ్రతుకిలా ఈడ్వగలను.

        (ఎ) ఆచార్య ఆత్రేయ (బి) వేటూరి సుందర్రామ్మూర్తి (సి) సిరివెన్నెల సీతారామశాస్త్రి (డి) దేవులపల్లి కృష్ణశాస్త్రి

 

(17) మనసనేది ఒకరినొకరు ఇచ్చినపుడే తెలిసేది - దాచుకుంటే అది ఎవరికీ దక్కకుండా పోతుంది

        (ఎ) ఆత్రేయ (బి) సిరివెన్నెల (సి) సినారె (డి) దాశరధి

 

(18) లేనివాడి బతుకే తెరలేని నాటకం - ఉన్నవాడిదంతా తెరచాటు నాటకం

       (ఎ) సినారె (బి) కొసరాజు (సి) సిరివెన్నెల (డి) జాలాది

 

(19) పొలాలమ్ముకుని పోయేవారు - టౌనులో మేడలు కట్టేవారు - బ్యాంకులో డబ్బు దాచేవారు - నీ శక్తిని గమనించరు వారు

       (ఎ) సినారె (బి) శ్రీశ్రీ (సి) కొసరాజు  (డి) ఆరుద్ర

 

(20) పాలవెల్లిలాంటి మనుషులు - పండు వెన్నెలవంటి మనసులు - మల్లెపూలరాశి వంటి మమతలు - పల్లెసీమలో కోకొల్లలు

       (ఎ) ఉషశ్రీ (బి)మైలవరపు గోపి (సి) మల్లెమాల (డి) మోదుకూరి జాన్సన్


 

సమాధానాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..!