పి రాజేంద్రప్రసాద్ 2026-08-01 20:19
శ్రీనివాస్ గారూ ఎలా మెదిలిందండీ మీ మనసులో ఈ ఊహ? నిజంగా అద్భుతం. మనసు
పొరలను ఎక్కడో కదిలించారు. ఎంతో కరుణార్ద్రంగా సాక్షాత్తు భగవంతుడినే
ఆలోచింపచేసే ప్రశ్నను అడిగారు మీరు. నిజంగా దీనికి సమాధానమే భగవద్గీత
అనేలా. హాట్స్ ఆఫ్ ఆండీ. హృదయపూర్వక అభినందనలు. -----------------------------------
Srinivas
2026-08-03 22:13
నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు నా ప్రయత్నం నచ్చినందుకు సంతోషం.
ధ్యన్య వాదములు. చాలా కాలం ఒక చిన్న ప్రశ్న మనసులో ఉండేది,
యుద్ధానికి అర్జునుడిని కృష్ణుడు ముందే ఎందుకు మానసికంగా ప్రిపేర్
చేయలేదు అని. జరగబోయేది అర్థం చేసుకోవాలంటే ఆ టైం రావాలా, లేక ఆ
మానసిక స్థితి వస్తే కానీ గీత అర్థం చేసుకో లేడనా. అదే ఆలోచనతో
కృష్ణుడిని ఒక సాధారణ మానవుడి కోణంలో ఆలోచిస్తే , అంత తాత్వికమైన
గీత ఆయనకీ ఎలా తోచింది అనిపించింది. ఆయన మానసిక ఘర్షణ , అంతర్మధనం
చెప్పాలని , రాసాను.
|