Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 
కీర్తి

గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com
 

ఒకావిడ జీవితకాలమంతా మనస్సులోని ఆలోచనలను కాగితం మీద పెట్టేది. వాటిని పదిమందితో పంచుకోవాలనే ఆలోచనగానీ, ప్రచురించాలనే కోరికగానీ ఆమెకి కలగలేదు. కొంతకాలానికి కన్ను మూసింది. ఆమె చెల్లెలు తన అక్క వస్తువులను సవరిస్తూండగా కాగితాలు బయటపడ్డాయి. చదవగా - ఆమెకి బాగా రుచించాయి. వెంటనే పత్రికలకి పంపింది. కవితా ప్రపంచం హర్షంచింది. అక్కున చేర్చుకుంది. అచిరకలంలో అమెరికా నెత్తిన పెట్టుకునే ప్రసిద్ధ రచయిత్రిగా పేరు పొదింది. ఆవిడ పేరు ఎమిలీ డెకెన్సన్.

ఎమిలీ 'కీర్తి ' ని గురించి అతి క్లుప్తమయిన వాక్యాలో అద్భుతంగా కవితని చెప్పింది. గొప్ప కవితకి అనువాదాన్ని అందకత్తె నీడని చూడడం లాగ అనిపిస్తుంది నాకు. అయినా తప్పదు. ఎమిలీ అన్నారు: కీర్తి ఒక తేనెటీగ. దానికి పాట ఉంది. కుట్టే కొండి ఉంది. ఆహా! ఎగిరిపోయే రెక్క ఉంది! అని.

కొందరికి కీర్తి వాళ్ళు పోయాక వస్తుంది. కొందరికి వాళ్ళు పోవడం వల్ల వస్తుంది. కొందరికి పోగొట్టడం వల్ల వస్తుంది. కొందరికి ఇలా పోగొట్టే మహానుభావుల భార్యలు కావడం వల్ల వస్తుంది.'కీర్తి' అంత దుర్మార్గమయిన పదార్ధం మరొకటి లేదు. మొదటి రకం: ఎమిలీ డెకెన్సన్. రెండో రకం: జెస్సికా లాల్, ప్రియదర్శనీ మట్టూ, ప్రతిభా మూర్తి వగైరా. మూడో రకం: అజ్మల్ కసాబ్, మనూ శర్మ, సంతోష్ సింగ్ వగైరా. నాలుగో రకం: బీహార్లో 243 మంది ఉన్న శాసన సభలో 64 మంది మీద హత్యానేరాలు నమోదయి ఉన్నాయి. 2005 లో కేవలం 919 మంది నేరాలు చేసిన వారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేశారు. ప్రస్తుతం మహానుభావుల భార్యహమ్మద్ షాబుద్దీన్ భార్యా హీనా, ఆనంద్ ఆనంద్ మోహన్ భార్య లవ్లీ, మున శుక్లా భార్య అనూ పోటీ చేస్తున్నారు.

నా చిన్నతనంలో ఎడ్డీ పోలో అనే మూకీ నటుడి గురించి మా నాన్నగారు చెపుతుండేవారు. కాస్త ఎదిగాక బాల గంధర్వ, స్థానం నర సింహా రావు గురించి మా అమ్మ మాట్లాడేది. కొంచెం టైమిస్తే - నా తరంలో ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు అని చెప్పుకునే రోజులు వచ్చేస్తాయి. మారేకాలంతో పాటు కీర్తికి రెక్కలొస్తాయి.

వీరంతా వారి వారి జీవిత కాలాల్లో అసాధారణ ప్రజ్నావంతులు. అయితే మరో స్థాయిలో అలౌకికమైన ప్రతిభనీ, మానవాళిపై ప్రభావాన్నీ చూపినవారున్నారు. ఆది శంకరులు.ఎన్ని శతాబ్దాల ప్రభావం? ఎంత బలమైన ప్రభావం? త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితార్, శ్యా శాస్త్రి. ఎంత అపూర్వమైన ప్రభావం! అయితే ము త్తుస్వామి దీక్షితార్ అంటే ఎవరు? ఆయన ఏం చేసేవారు? అని అడిగే తరం ఇప్పటికే ఉంది.

గ్రాహం బెల్, ధామస్ ఆల్వా ఎడిసన్. లూయీ పాశ్చర్ - వీళ్ళ పేర్లే ఎవరూ విని ఉండరు. అయితే ప్రతీక్షణం వీరు మానవాళి జీవనంలో తమ పాత్రని అజ్నాతంగా నిర్వహిస్తూనే ఉన్నారు. చేతుల్లో సెల్ ఫోన్లు పట్టుకున్నవాళ్ళు అది గ్రాహం బెల్ భిక్ష అనీ, స్విచ్ నొక్కి దీపాలు వెలిగించేవారు వెలుగుకీ ఎడిసన్ దోహదం ఉన్నదనీ పిచ్చికుక్క కాటునుంచి బతికి బట్ట కట్టినవాళ్ళు లూయీ పాశ్చర్ ప్రాణ భిక్ష పెట్టాడనీ ఎరగరు. కాని ప్రతిఫలాన్ని ఆశించకుండా లాంటి వైతాళికుల కృషి అజరామరంగా మానవాళిని రక్షిస్తూంటుంది. లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా మహానుభావులు చేసిన కృషి సాంద్రతని బట్టి కీర్తి వైశాల్యం పెరుగుతుంది.

ప్రకాశం జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా అయింది కనుక, చెన్నైలో మౌంట్ రోడ్డు అన్నాశాలై అయింది కనుక, కామన్వెల్తు క్రీడల మైదానం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అయింది కనుక, న్యూయార్కులో విమానాశ్రయం జాన్ ఎఫ్.కెనెడీ విమానాశ్రయం అయింది కనుక ఇటలీలో విమానాశ్రయం గెలిలియో విమానాశ్రయం అన్నారు కనుక - పెద్దలందరూ 'కొన్నాళ్ళు ' మన మధ్య జీవిస్తారు. నాకనిపిస్తుంది - రాబోయే కాలంలో తమిళ పిత్తన్ అనే నాయకుడు తమిళనాడుని పాలిస్తే అన్నాశాలై తమిళ పిత్తన్ శాలై అయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎమిలి డికన్సన్ కవిత మరొక్కసారి - కీర్తి జోకొట్టే పాట ఉంది. చట్టున కుట్టే కొండె ఉంది. గుప్పుమని ఎగిరిపోయే రెక్క ఉంది. అదీ దాని దుర్మార్గం.

నేను గాంధీ తరంలో పుట్టాను. మా నాన్నగారు గాంధీని చూశారు. గాంధీని ఆరాధించిన తరం ఇంకా అక్కడా అక్కడా బతికే ఉంది. 141 సంవత్సరాల తర్వాత గాంధీ వారసత్వ్వాన్ని ఇప్పటికీ కాస్త బలహీనంగా జ్నాపకం చేసుకుంటున్నాం.

అయితే ఇప్పుడిప్పుడే గాంధీని గుర్తుంచుకోనక్కరలేదని భావించే తరం పుట్టుకొస్తోంది. ;గాంధీ అంటే ఎవరు? ' అని వెర్రి చూపు లు చూసే తరం అప్పుడే పుట్టేసింది. గాంధీ వి గ్రహాన్ని దక్షిణాఫ్రికాలో రైల్లోంచి బయటికి తోసేసిన స్టేషన్ - పీటర్ మారిట్స్ బర్గ్ - ప్రాంగణంలో మధ్యనే నిలిపారు. ఇంగ్లండులో ఆయన విగ్రహం ఉంది. హ్యూస్టన్ లో పార్కులో గాంధీ విగ్రహం ముందు కూర్చుని నేనూ, మిత్రులు మల్లాది వెంకట కృష్ణమూర్తి గారూ ఫోటోలు తీయించుకున్నాం. శా న్ ఫ్రాన్సిస్కోలోనూ గాంధీ విగ్రహం ఉంది.

అయితే విగ్రహాన్ని క్కడి నుంచి తీసేయాలని - అమెరికా వారు కాదు - భారత దేశానికి సంబంధించిన మైనారిటీ వర్గాల సంస్థ కోరుతోంది. ఎందుకని? ఆయన జాతి వివక్షని రెచ్చగొట్టాడని. ఆయన హిందువులకి అన్యాయం చేశాడని 1948 లో ఒక హిందువు కోపం తెచ్చుకుని ఆయన్ని చంపాడు. హిందువు పేరు నాధూరాం గాడ్సే.

విగ్ర హం స్థానంలో ఎవరిది ఉంచాలి? మార్టిన్ లూధర్ కింగ్ నో, అంబేద్కర్నో ఉంచాలి.. నా చిన్నతనంలో ఇద్దరి పేర్లూ వినలేదు. అది నా 'చిన్న'తనమేమో.

మౌంట్ రోడ్ న్నాశాలై కావడానికి 40 ఏళ్ళు పట్టింది. జాన్ కెనెడీ విమానాశ్ర యం పేరుగా మారడానికి 50 ఏళ్ళు సరిపోయాయి. మహాత్ముడి కీర్తి కాలదోషం పట్టడానికి 141 సంవత్సరాలు పట్టింది.

కీర్తికి గుప్పుమని ఎగిరిపోయే రెక్కలున్నాయి.  

***
అక్టోబర్
11, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage